విధాత: అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగువారుండరంటే అతిశయోక్తి కానే కాదు. తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా, నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఆమె ఇప్పుడు సినిమాలలో తన సత్తా చాటేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మొదట బుల్లితెరను ఒక రేంజ్‌లో ఉపేసిన ఈమె.. ఆ తర్వాత సినిమాలపై దృష్టి సారించింది. ఈమె కెరీర్ మొదట్లో న్యూస్ రీడర్‌గా మొదలై.. తర్వాత యాంకర్, ఆ తరువాత జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.
దాంతో వరుసగా సినీ అవకాశాలు వచ్చాయి. ‘రంగస్థలం’ చిత్రం నటిగా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అంతకు ముందు నటించిన ‘క్షణం’ చిత్రం కూడా బాగా పేరు తెచ్చింది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో బుల్లితెరకు బై చెప్పేసింది. ప్రస్తుతం ఆమె బుల్లితెర షోలు చేయడం లేదు. పూర్తిగా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉంటుంది.
వీటితో పాటు ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. అయితే కొన్ని సార్లు సోషల్ మీడియా వేదికగా ఆమె చేసే పోస్టులు తీవ్ర వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసే పోస్టులు ద్వారా ఎన్నో వివాదాలు ఎదుర్కొని నెటిజన్ల ట్రోల్స్‌కు గురైంది.
తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా మరో పోస్ట్ చేసింది. ఇది కూడా వైరల్ అవుతుంది. ఈ పోస్టులో ఆమె.. నేను చాలా బాగా దెబ్బతిన్నాను కానీ.. నేను హర్ట్ అయ్యే విధంగా ఎవరిని హర్ట్ చేయలేదు అంటూ పోస్ట్ చేసింది. ఇంతకీ అనసూయను అంతగా బాధ పెట్టిన వాళ్ళు ఎవరు అని అభిమానులు ఈ పోస్టు గురించి చర్చ జరుపుతున్నారు. బహుశా విజయ్ దేవరకొండ గురించి ఇది కావచ్చని పలువురి అభిప్రాయం. మరి నిజమేంటో అనసూయ మరోసారి సోషల్ మీడియాలో స్పందిస్తే గాని పూర్తి క్లారిటీ రాదు.