Site icon vidhaatha

TRSకు ఈసీ షాక్‌: మంత్రి జగదీశ్ రెడ్డి.. ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనవద్దు

విధాత‌, ఢిల్లీ: టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి జగదీశ్ రెడ్డిపై ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన ఎలాంటి ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనరాదని.. అలాగే పత్రికా సమావేశాలు, టీవీ ఇంటర్వ్యూలలో కూడా పాల్గొనరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 48 గంటల పాటు ప్రచారం నిర్వహించకుండా ఆయనపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈనెల 25వ తేదీన ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా మంత్రి చేసిన ప్రసంగం రూ.2వేల పెన్షన్ కావాల్నా ? వద్దా..? రైతు బంధు, 24 గంటల కరెంట్, దివ్యాంగులకు పెన్షన్ వంటి స్కీములు అమలు కావాలంటే కేసీఆర్ కు ఓటేయాలె.. ఇవన్నీ ఆగిపోవాలంటే మోడీకి ఓటు వేయాలె’’ అని మంత్రి కామెంట్లు చేశారు.

ఇందుకు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గాను ఈసీ శుక్రవారం ఆయనకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం 3 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించగా.. ఈ మేరకు మంత్రి జగదీష్ రెడ్డి ఈసీకి వివరణ ఇచ్చారు. మంత్రి జగదీష్ రెడ్డి ఇచ్చిన వివరణపై ఈసీ స్పందించి 48 గంటల నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version