NALGONDA: ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి కృషి: MLA ర‌వీంద్ర‌కుమార్‌

విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తానని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ శాసన సభ్యుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని యంకేఆర్ డిగ్రీ కళాశాలలో ప్రెషర్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యంకేఆర్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి, నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆయన తెలిపారు. ప్రభుత్వ విద్యాలయాల బలోపేతానికి ప్రభుత్వం […]

  • Publish Date - December 6, 2022 / 11:17 AM IST

విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తానని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ శాసన సభ్యుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని యంకేఆర్ డిగ్రీ కళాశాలలో ప్రెషర్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యంకేఆర్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి, నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆయన తెలిపారు.

ప్రభుత్వ విద్యాలయాల బలోపేతానికి ప్రభుత్వం ప‌నిచేస్తుంద‌ని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింద‌ని ఆయన గుర్తు చేశారు. కేజీ టూ పీజీ ఉచిత నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంద‌న్నారు. రాజకీయాలకు అతీతంగా కళాశాల అభివృద్ధి చేశామ‌న్నారు.

పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో గిరిజన డిగ్రీ గురుకుల కళాశాల ఏర్పాటు చేశామ‌ని గుర్తు చేశారు. కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్, మండలాధ్యక్షుడు TVN రెడ్డి, దేవేందర్, స్థానిక కౌన్సిలర్ తస్కీనసుల్తానా, CPDC కార్యదర్శి శంసాన్, కళాశాల ప్రిన్సిపాల్ రామరాజు, పగిడిమర్రి రఘురాములు, గాజుల రాజేష్, టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, తౌఫిక్ ఖాద్రీ, బొడ్డుపల్లి కృష్ణ, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.