Site icon vidhaatha

ఏక్‌నాథ్‌ శిండే వర్గమే అసలైన ‘శివసేన’: కేంద్రం ఎన్నికల సంఘం

శివసేన పార్టీ, అధికారిక గుర్తు ఎవరిది? అనేది విషయంపై కొంతకాలంగా ఉద్ధవ్‌ ఠాక్రే, ఏక్‌నాథ్‌ శిండ్‌ వర్గాల మధ్య వివాదం నడుస్తున్నది. దీనిపై కేంద్రం ఎన్నికల సంఘం ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. ఏక్‌నాథ్‌ శిండే వర్గమే అసలైన శివసేన పార్టీని ఈసీ గుర్తించింది.

ఆ వర్గానికే విల్లు-బాణం గుర్తును కేటాయించింది. దీంతో పార్టీ కార్యాలయం కూడా శిండే వర్గానికే చెందే అవకాశం ఉన్నది. సుమారు ఎనిమిది నెలల కిందట శివసేన రెండువర్గాలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. అసలైన శివసేన మాదంటే మాది అని ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

శిండే నేతృత్వంలోని వర్గం, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మరో పార్టీ గుర్తు కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. అయితే గుర్తు కేటాయింపు అంశాన్ని ఎన్నికల సంఘమే నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా శిండే వర్గమే అసలైన శివసేన అని, ఆ వర్గానికే పార్టీ గుర్తు అయిన విల్లు-బాణం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది.

Exit mobile version