Site icon vidhaatha

500 Notes: పొలంలో రూ.500 నోట్ల కట్టలు.. షాకైన‌ రైతులు

నల్గొండ (Nalgonda) జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో పొలానికి వెళ్లిన రైతులకు అక్క‌డ‌ రూ.20 లక్షల విలువైన 500 నోట్ల (500 Notes) కట్టలు 50 వ‌ర‌కు కనిపించడంతో షాక‌య్యారు. వాటిని వారు ఎంతో ఆనందంతో ఇంటికీ తీసుకెళ్ల‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

దీంతో మిర్యాల‌గూడ రూర‌ల్ సీఐ వీరబాబు ఘ‌ట‌నా స్థాలానికి చేరుకుని త‌నిఖీ చేయ‌డంతో పాటు ఆఅక్క‌డ ల‌భించిన నోట్ల‌పై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కాకుండా చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉండటంతో అవాక్క‌య్యారు.

ఇది దొంగ నోట్లు ముద్రించే వారి పనే అయి ఉంటుందని భావించిన పోలీసులు ఈ నోట్లు ఇక్క‌డి ఎలా వ‌చ్చాయ‌నే విష‌యంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశం ప్ర‌స్తుతం ప‌రిస‌ర ప్రాంతాల్లో బాగా చ‌ర్చ‌నీయాంశం అయింది. మ‌రిన్ని విష‌యాలు తెలియాల్సి ఉంది. అయితే నకిలీ నోట్లు ముద్రించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు స‌మాచారం.

Exit mobile version