Site icon vidhaatha

Viral News | పెళ్లిలో మామ అల్లుడికి ఇచ్చిన కానుకను చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

bulldozer gifts | మెట్టినింటికి వెళ్తున్న కూతురు అల్లుడితో కలిసి జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. పెళ్లి సమయంలో తాహతుకొద్ది కట్నాకలు కట్న కానుకలు సమర్పిస్తుంటారు. కొందరు అల్లుడికి బైక్‌లు లేదంటే.. కార్లు కానుకగా ఇస్తుంటారు. మరికొందరు కూతురికి విలువైన బంగారు ఆభరణాలు ఇస్తుంటారు.

కానీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ తండ్రి కూతురు, కాబోయే అల్లుడికి బుల్డోజర్‌ను కానుకగా ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచాడు. వివారల్లోకి వెళితే.. హమీర్‌పూర్‌ జిల్లాలోని సుమెర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్‌గావ్‌లో నివసిస్తున్న రిటైర్డ్ జవాన్‌ పరశురామ్ ప్రజాపతి తన కుమార్తె నేహాకు సౌఖర్‌ గ్రామ వాసి, ఇండియన్‌ నేవీలో పని చేస్తున్న యోగేంద్రకు ఇచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయించారు.

ఫిఫా ఫుట్ బాల్ విజేత అర్జెంటీనా

ఈ నెల 15న వివాహ జరుగ్గా.. వివాహ సమయంలో కుమార్తె నేహాకు తండ్రి పరశురామ్‌ బుల్డోజర్‌ను కానుకగా సమర్పించారు. బుల్డోజర్‌ను కానుకగా ఇవ్వడం వెనుక ఉన్న తన ఉద్దేశాన్ని చెప్పుకొచ్చాడు. అల్లుడికి కారును కానుకగా ఇస్తే అది కేవలం ఇంటి ముందే ఉంటుందని.. బుల్డోజర్‌ అయితే ఆదాయాన్ని తీసుకువస్తుందని చెప్పాడు.

తాను సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్నానని, ఖర్చుల కోసం తన భర్తను డబ్బు అడగాల్సిన అవసరం ఉండదని కొత్త పెళ్లి కూతురు నేహా చెప్పింది. బుల్డోజర్‌ కానుక వార్తను తెలుసుకున్న పలువురు పెళ్లిని చూసేందుకు తరలించ్చారు. బుల్డోజర్‌ను చూసి సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బుల్డోజర్‌ను కానుకగా ఇచ్చిన తండ్రిని పలువురు అభినందించారు.

BIGGBOSS: బిగ్ బాస్ సీజన్-6 విజేత రేవంత్

Exit mobile version