Site icon vidhaatha

Nalgonda: SBI బ్యాంకులో మంటలు

విధాత: నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ SBI బ్యాంకులో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం తెల్లవారుజామున బ్యాంకు నుంచి పొగలు వచ్చి అలారం మోగడంతో వాచ్ మెన్స్ అప్రమత్తమై బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు.

వారు హుటాహుటిన బ్యాంకుకు చేరుకొని తెరిచి చూడగా షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటల్లో ఫాల్ సీలింగ్, కంప్యూటర్స్, ఫర్నిచర్స్ దగ్ధమై కనిపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు.

బ్యాంకులోని లాకర్లు, రికార్డ్స్ భద్రంగానే ఉన్నాయి. ప్రమాదం నేపథ్యంలో బ్యాంకుకు వచ్చే కస్టమర్స్‌ను సమీపంలోని ఉడిపి హోటల్ బ్రాంచ్‌కు వెళ్లాలని సూచించారు.

Exit mobile version