Wines |
విధాత: రాష్ట్రంలో 2023-25 కాల పరిమితికి మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తులు లక్ష దాటగా, ప్రభుత్వానికి 2వేల కోట్ల వరకు ఆదాయం లభించింది. దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది.
ఆఖరి రోజు అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయి. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు కడపటి సమాచారం మేరకు 1లక్ష 8వేలకు పైగా దరఖాస్తులు అందాయి.
చివరి రోజు అత్యధికంగా సరూర్ నగర్‌లో 8,883, శంషాబాద్‌లో 8,749 దరఖాసుస్తులు అందాయి. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 6వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రాత్రి వరకు కూడా దరఖాస్తుదారులు బారులు తీరి కనిపించారు.
ఈనెల 21న కొత్త వైన్స్‌ల లైసెన్స్‌ల జారీకి లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. గత ఏడాది 79వేల దరఖాస్తులు అందగా, ఈ దఫా 40శాతం పెరిగినట్లుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు.