Santosh Kumar | కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్సీ.. మాతృ సంస్థలోకి సంతోష్ కుమార్

Santosh Kumar | సన్నిహితుల సూచన మేరకే.. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని వెల్లడి విధాత బ్యూరో, కరీంనగర్: శాసనమండలి మాజీ సభ్యుడు తిరువరంగం సంతోష్ కుమార్ మాతృ సంస్థ కాంగ్రెస్ లో చేరనున్నారు. శనివారం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. శాసనమండలి సభ్యుడిగా నాలుగేళ్ల క్రితం అధికార బీఆర్ఎస్ లో చేరిన సంతోష్ కుమార్, పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం లేదంటూ రాజీనామా చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ఈ […]

  • Publish Date - September 2, 2023 / 02:46 PM IST

Santosh Kumar |

  • సన్నిహితుల సూచన మేరకే..
  • పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని వెల్లడి

విధాత బ్యూరో, కరీంనగర్: శాసనమండలి మాజీ సభ్యుడు తిరువరంగం సంతోష్ కుమార్ మాతృ సంస్థ కాంగ్రెస్ లో చేరనున్నారు. శనివారం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. శాసనమండలి సభ్యుడిగా నాలుగేళ్ల క్రితం అధికార బీఆర్ఎస్ లో చేరిన సంతోష్ కుమార్, పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం లేదంటూ రాజీనామా చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

సంతోష్ కుమార్ అధికార పార్టీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలు ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించారు. తన మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో చర్చించిన అనంతరమే ఒక నిర్ణయం తీసుకోవాలని భావించిన సంతోష్ కుమార్ శనివారం ఈ మేరకు సమావేశం ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్, ఎంఐఎం, బీఎస్పీ పార్టీలతో పాటు పట్టణ ప్రముఖులు, న్యాయవాదులు పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించడం, అదే పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగడం, జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా భవన్ నిర్మాణంలో చేసిన కృషి తదితర అంశాల దృష్ట్యా ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుందని అనేకమంది సూచించారు. వారందరి అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ లో చేరనున్నట్టు ప్రకటించిన సంతోష్ కుమార్, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం తన కర్తవ్యం అని చెప్పారు.

ఈ సమావేశంలో ఎంఐఎం నేత సయ్యద్ వహజుద్దీన్, బీఎస్పీ నేత విశ్వం, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు సమిండ్ల శ్రీనివాస్, కిసాన్ సంఘ్ నేత జోగినపల్లి సంపత్ రావు, రాచకొండ తిరుపతి గౌడ్, మాజీ కౌన్సిలర్ తిరుపతి, నిర్ల ప్రభాకర్, లియాకత్ అలీ, నాగ మోహన్, దేవేందర్ పటేల్, ప్రశాంత్ దీపక్, మాదాసు శ్రీనివాస్, దామోదర్ పాల్గొన్నారు.

టికెట్ సందిగ్ధం
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ముగిసిపోయింది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితా వడకట్టే పని నడుస్తోంది. కరీంనగర్ శాసనసభ టికెట్ ఆశిస్తూ పదుల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో సంతోష్ కుమార్ తిరిగి పార్టీలోకి చేరడంతో టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

Latest News