Pregnant Sisters | ఒకేసారి నలుగురు అక్కాచెల్లెళ్లు గర్భం దాల్చడం ఏంటని అనుకుంటున్నారా..? మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమి లేదు. ఇది నిజమే. నలుగురు అక్కాచెల్లెళ్లు రోజుల తేడాతోనే తమ పిల్లలకు జన్మనివ్వబోతున్నారు.
కెర్రీ అన్నే థామ్సన్(41), జే గుడ్‌విల్లీ(35), కాయ్‌లైహ్ స్టెవర్డ్(29), ఆమీ గుడ్‌విల్లీ(24).. ఈ నలుగురు అక్కాచెల్లెళ్లు. అయితే స్టెవర్ట్, జే గుడ్‌విల్లీ.. ఈ నెలలోనే మగ పిల్లలకు జన్మనివ్వబోతున్నారు. ఇక థామ్సన్, ఆమీ గుడ్‌విల్లీ అక్టోబర్, ఆగస్టు నెలల్లో డెలివరీ కాబోతున్నారు. ఈ నలుగురికి పుట్టబోయే పిల్లలతో క్రిస్మస్ నాటికి ఆ ఇంట్లో పిల్లల సంఖ్య రెట్టింపు కానుంది. అంటే పిల్లల సంఖ్య ఎనిమిదికి చేరుకోనుంది.
ఈ సందర్భంగా కాయ్‌లైహ్ స్టెవర్డ్ మాట్లాడుతూ.. రోజుల తేడాతోనే మేం నలుగురం గర్భం దాల్చాం. క్రిస్మస్ నాటికి అందరం డెలివరీ అయిపోతాం. నలుగురం ఒకేసారి గర్భం దాల్చడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరో నలుగురు పిల్లలు కొత్తగా మా ఫ్యామిలీలో జాయిన్ కాబోతున్నారని తెలిపింది.
తమ పిల్లలంతా ఒకే ఏజ్ గ్రూప్ కావడం మరింత సంతోషాన్ని కలిగిస్తుందని స్టెవర్డ్ పేర్కొంది. స్కూల్‌కు కూడా అందరూ ఒకేసారి వెళ్తారని, నర్సరీలోనే నలుగురు పిల్లలు కలిసి చదవడం ప్రారంభిస్తారని, వీరు గొప్ప స్నేహితులయ్యే అవకాశం ఉందని స్టెవర్డ్ ఆశాభావం వ్యక్తం చేసింది.
Watch the latest video at foxnews.com