CM Jagan | సీఎం జగన్ పాలనకు నాలుగేళ్లు.. ట్విట్టర్‌లో వైసీపీ తుఫాను

లక్షలు దాటినా ట్వీట్లు,, షేర్లు విధాత‌: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా నాలుగేళ్లు అయింది. 2019 మే 23న జగన్‌మోహన్ రెడ్డి (CM Jagan) సారథ్యంలోని పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్ పార్టీకి 151 అసెంబ్లీ స్థానాలు రాగా తెలుగుదేశానికి 23, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు కేవలం ఒక్క సీట్ వచ్చింది. అయితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయిన సందర్భంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ట్విట్టర్‌ను షేక్ చేస్తోంది. […]

  • Publish Date - May 23, 2023 / 07:54 AM IST

  • లక్షలు దాటినా ట్వీట్లు,, షేర్లు

విధాత‌: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా నాలుగేళ్లు అయింది. 2019 మే 23న జగన్‌మోహన్ రెడ్డి (CM Jagan) సారథ్యంలోని పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్ పార్టీకి 151 అసెంబ్లీ స్థానాలు రాగా తెలుగుదేశానికి 23, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు కేవలం ఒక్క సీట్ వచ్చింది.

అయితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయిన సందర్భంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ట్విట్టర్‌ను షేక్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పార్టీకి, జగన్‌కు ఉన్న లక్షలాది కార్యకర్తలు, అభిమానులు #YSRCPAgain2024 హ్యాష్ ట్యాగ్ మీద లక్షల్లో ట్వీట్స్, రీ ట్వీట్స్ చేస్తున్నారు.

దీంతో ఇప్పటికే రెండున్నర లక్షలు దాటిన ట్వీట్స్ తో దేశంలోనే ఈ అంశం నంబర్ వన్‌గా నిలిచింది. వాస్తవానికి జగన్‌కు మొదటి నుంచీ సోషల్ మీడియా వెన్ను దన్నుగా నిలుస్తూ వస్తోంది. 2014 ఎన్నికల సమయంలో మొదలైన ఈ సోషల్ మీడియా సైన్యం లక్షలకు చేరింది.

కాగా.. వారిలో ఎక్కువ మంది స్వచ్చందంగా జగన్‌కు మద్దతుగా నిలుస్తూ తమ అభిప్రాయాలూ పోస్ట్ చేయడం, అటు టీడీపీని పవన్ కళ్యాణ్‌ను డిఫెండ్ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. జగన్ కు పార్టీ పరంగా ఉన్న కార్యకర్తల కన్నా సోషల్ మీడియా సైన్యమే ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పవచ్చు.

గతంలో జగన్ కూడా ఈ అంశం మీద మాట్లాడుతూ తనకు సోషల్ మీడియా సైన్యం మద్దతు ఎంతో ఉందని, తన విజయం వెనుక వారి పాత్ర చాలా ఎక్కువ అని కొనియాడుతూ పార్టీ నాయకులను సైతం సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పడం గమనార్హం.

దీంతో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళుతోంది. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా కోర్దినేటర్లు .. ఇంఛార్జులతో కూడిన వ్యవస్థను నిర్మించిన జగన్ టిడిపి మీద రాజకీయ దాడులకు సైబర్ సైన్యాన్ని సిద్ధం చేశారు.

రాజకీయంగా జగన్ మీద టిడిపి వాళ్ళు చేసే ఆరోపణలను తిప్పికొట్టడంలో ఈ సైన్యం సమర్థంగా పని చేస్తున్నట్లే కనిపిస్తోంది. మొత్తానికి నాలుగేళ్ళ పాలనతో మొత్తం ట్విట్టర్ ను ఈ రోజుకు ఆక్రమించిన జగన్ సైన్యం తన బలాన్ని చూపించింది. సాయంత్రానికి ఆ ట్వీట్స్, రీ ట్వీట్స్ మొత్తం ఐదారు లక్షలు దాటుతుందని క్యాడర్ నమ్ముతోంది.

Latest News