విధాత: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని అధికారవర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ప్రతి రిపబ్లిక్ డే వేడుకకు విదేశీ ప్రముఖులను భారత్ ఆహ్వానించడం ఆనవాయితీ.
అందులో భాగంగానే ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలకు తొలుత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను భారతదేశం ఆహ్వానించింది. అయితే తనకు ఇతర కార్యక్రమాలు ఉండటం వల్ల జనవరిలో న్యూఢిల్లీకి రాలేకపోతున్నానని తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్ ముఖ్య అతిథిగా ఆహ్వానించగా, ఆయన ఓకే చెప్పినట్టు అధికార వర్గాలు తెలిపాయి.