Site icon vidhaatha

తమ్ముడికి తన భార్యనిచ్చి పెళ్లి చేసిన అన్న.. ఎందుకంటే..?

విధాత: ఆ దంతులకు 24 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతోంది. కాకపోతే.. భర్త ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రంలో పని చేస్తున్నాడు. దీంతో భార్య తన మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇంకేముంది తన తమ్ముడిని ఇష్టపడుతున్న భార్యకు.. అతనితోనే వివాహం జరిపించాడు అన్న. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లాలో శుక్రవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.

మంత్రి అంబటి రాంబాబు.. మాములు ‘కళాకారుడు’ కాదండోయ్!

వివరాల్లోకి వెళ్తే.. నదియా జిల్లాలోని శాంతిపూర్ కు చెందిన అమూల్యా దేబ్ నాథ్ కు, బబ్లా నివాసి దీపాలీ దేబ్ నాథ్‌కు 24 ఏండ్ల క్రితం పెళ్లి అయింది. ఈ దంపతులకు 22 ఏండ్ల కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయికి కూడా వివాహం జరిగింది.

నేను ఓడిపోతే.. మునుగోడుపై బాంబులే: కేఏ పాల్

అయితే కోడలు గత కొద్ది రోజుల నుంచి పుట్టింట్లో ఉంటోంది. ఉపాధి నిమిత్తం అమూల్యా దేబ్ నాథ్ వేరే రాష్ట్రానికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దీపాలి.. తన సొంత మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

అభిమానులకి షాకిచ్చిన బండ్ల గణేష్.. ఇక గుడ్ బై!

ఈ విషయం అమూల్యాకు తెలియడంతో.. వారిద్దరూ ఏకాంతంగా ఉండే సమయం కోసం వేచి చూశాడు. గత శుక్రవారం రాత్రి దీపాలీ తన మరిదితో సన్నిహితంగా ఉన్న సమయంలో అమూల్యా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆ తర్వాత గ్రామస్తులకు చెప్పాడు. దీపాలీకి తన సోదరుడు కిశబ్‌కు గ్రామస్తుల సమక్షంలో పెళ్లి చేశాడు. వారి ఇష్టాన్ని కాదనలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని అమూల్యా స్పష్టం చేశాడు.

ఆ రాశుల వారికి కోరిక‌లు ఎక్కువ‌ట‌..? మ‌రి మీ రాశేంటి!

Exit mobile version