విధాత: హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ లో విషాదం చోటుచేసుకుంది. బాత్‌రూమ్‌లో గీజర్ పేలి విద్యుత్ షాక్‌తో వైద్యులైన నవ దంపతులు మరణించారు. లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదర్‌బాగ్‌లో గురువారం ఈ ఘటన జరిగింది.
డాక్టర్ నిసారుద్దీన్, డాక్టర్ ఉమ్మా య్ మెహిమాన్ సాహిమకు రెండు నెలల క్రితం వివాహమైంది. నిసారుద్దీన్ సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. వీరు ఖాదర్‌బాగ్‌లోను, సాహిమ తల్లిదండ్రులు టోలిచౌకిలోని మెరాజ్ కాలనీలో నివాసముంటున్నారు.
కాగా.. ఉదయం నుంచి సాహిమ నుంచి ఫోన్ రాకపోవడం, కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఖాదర్‌బాగ్‌లో కూతురు, అల్లుడు ఉంటున్న ఫ్లాట్ వద్దకు వెళ్లారు. కాలింగ్ బెల్ కొట్టినా ఎంతకూ తలుపులు తెరవలేదు.
దాంతో డోర్లు పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. నిసారుద్దీన్, సాహిమా బాత్రూంలో పడి ఉండడం చూసి షాక్‌కు గురయ్యారు. పోలీసులకు సమాచారమివ్వగా ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టంకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ విషాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన లంగర్ హౌస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.