Gold-Silver Rates |
బంగారం, వెండి ధరలు మరోసారి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గురువారం ధరలు స్వల్పంగా పెరగ్గా.. శుక్రవారం ఒకే రోజు రూ.300పైగా పెరుగుదల నమోదైంది.
22 క్యారెట్ల తులం బంగారంపై రూ.300 పెరిగి రూ.55,450కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.330 పెరిగి.. రూ.60,490 పలుకుతున్నది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం పసిడి రూ.55,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,640 వద్ద ట్రేడవుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,640కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,870గా ఉన్నది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,490 పలుకున్నది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధరలు సైతం శుక్రవారం భారీగా పెరిగింది. ఒకే రోజు వెండి కిలోకు రూ.1000 పెరిగి కిలోకు రూ.78,400కి చేరింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి రూ.81,500 పలుకుతున్నది.