Gold Rate | కొనుగోలుదారులకు షాక్‌.. మరోసారి పెరిగిన బంగారం ధరలు..! తులం ధర ఎంత ఉందంటే..?

Gold Rate | పసడి ధరలు వినియోగదారులకు షాక్‌ ఇచ్చాయి. మొన్న నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన ధరలు మంగళవారం పైకి కదిలాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.110 వరకు పెరిగి.. రూ.56,600కు చేరింది. ఇక 24 క్యారెట్ల పసడి ధర రూ.120 పెరిగి.. రూ. 61,750 వద్ద ట్రేడవుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర […]

  • Publish Date - May 9, 2023 / 02:49 AM IST

Gold Rate | పసడి ధరలు వినియోగదారులకు షాక్‌ ఇచ్చాయి. మొన్న నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన ధరలు మంగళవారం పైకి కదిలాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.110 వరకు పెరిగి.. రూ.56,600కు చేరింది. ఇక 24 క్యారెట్ల పసడి ధర రూ.120 పెరిగి.. రూ. 61,750 వద్ద ట్రేడవుతున్నది.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,750 ఉండగా.. 24 క్యారెట్ల పసడి ధర రూ. 61,900 పలుకుతోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.56,600 పలుకుతోండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.61,750 వద్ద కొనసాగుతున్నది.

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ.57,100 ఉండగా.. 24 క్యారెట్ల పసడి ధర రూ.62,290 వద్ద ఉన్నది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,800 వద్ద ట్రేడవుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,600 పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.61,750 వద్ద కొనసాగుతున్నది. తెలుగు రాష్ట్రాలంతా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. వెండి ధరలు మంగళవారం పెరిగాయి. కేజీ వెండిపై రూ.400 వరకు పెరిగింది.

కిలో రూ.78,100 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.82,700కి చేరింది. అలాగే ప్లాటినం ధరలు సైతం పెరిగాయి. తులం ప్లాటినంపై రూ.50 పెరిగి.. రూ.27,900కి చేరింది.

Latest News