Site icon vidhaatha

Gold Rate | స్వల్పంగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే..!

Gold Rate |

బంగారానికున్న డిమాండ్‌ ప్రపంచంలో దేనికీ ఉండదు. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ఎక్కువగా బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. మొన్నటి వరకు భారీగా పెరిగిన ధరలు ఇటీవల కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.

తాజాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.70 తగ్గింది. 24 క్యారెట్ల పుత్తడి(Gold)పై రూ.80, కిలో వెండిపై రూ.500 వరకు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,650కి చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.60,710 వద్ద స్థిరపడింది.

ఇక కిలో వెండి ధర రూ.80వేలు పలుకుతున్నది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.55,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.60,860 వద్ద ట్రేడవుతున్నది. ముంబయిలో 22క్యారెట్ల బంగారం ధర రూ.55,650 ఉండగా.. పది గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.60,710 వద్ద కొనసాగుతున్నది.

Exit mobile version