మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే..!

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల వరుసగా భారీగా పెరుగుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు

  • Publish Date - December 23, 2023 / 05:31 AM IST

Gold Rate | బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల వరుసగా భారీగా పెరుగుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా శనివారం బులియన్‌ మార్కెట్‌లో ధర మళ్లీ పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.350 పెరిగి.. తులానికి రూ.58వేలకి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల పసిడిపై రూ.230 పెరిగి తులానికి రూ.63,230వేలకు పెరిగింది.


దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.58,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,550 పలుకుతున్నది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58వేలు ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,250కి ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.58,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,380కి పెరిగింది.


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.58వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,230 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం మార్కెట్‌లో పెరిగింది. వెండిపై రూ.300 పెరిగి.. కిలోకు రూ.79,500 ఎగిసింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.81వేలకు చేరింది.