Site icon vidhaatha

Gold Rates | బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. రూ.61వేల దిగువకు పడిపోయిన ధర..!

Gold Rates | బంగారం ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే. మంగళవారం దేశవ్యాప్తంగా పుత్తడి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.150 తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.170 తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850కి తగ్గింది.

ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,910కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,700 పలుకుతోంది. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,760 వద్ద ట్రేడవుతున్నది.

చెన్నైలో 22క్యారెట్ల బంగారం ధర రూ. 56,300 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,420 వద్ద కొనసాగుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.55,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,760కు దిగివచ్చింది. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు తగ్గాయి. వెండిపై రూ.200 వరకు తగ్గి.. కిలో రూ.76వేలకు చేరింది.

Exit mobile version