Gold Price | దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 గ్రాముల తులం బంగారంపై రూ.100 తగ్గి.. రూ.55,250 పలుకుతున్నది. మరో వైపు 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.100 తగ్గి రూ.60.280కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,430 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,250 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,550 వద్ద కొనసాగుతున్నది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.55,250 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,410కి చేరింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ.55,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,280 పలుకుతున్నది.
తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతితో పాటు వరంగల్, కరీంనగర్ తదితర నగరాల్లోనే ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి రూ.77వేల వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80వేల వద్ద ట్రేడవుతున్నది.