Site icon vidhaatha

Gold Price Hike | రెండురోజుల్లో అక్షయ తృతీయ.. పెరిగిన బంగారం ధర..! మళ్లీ రూ.61వేలు దాటిన పుత్తడి..!

Gold Price Hike |

అక్షయ తృతీయ దగ్గరపడుతుండడంతో బంగారం ధరలు షాక్‌ ఇస్తున్నాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల ధరలు నిలకడగా కొనసాగుతుండగా.. గురువారం మళ్లీ పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.200, మరో వైపు 24 క్యారెట్ల బంగారంపై రూ.230 వరకు పెరిగింది. కిలో వెండిపై రూ.200 దాకా పెరిగింది.

ఇక హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,050కి పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,150కి చేరింది. కిలో వెండి ధర రూ.80వేలుగా ఉన్నది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,050కి పెరగ్గా.. 24 గోల్డ్‌ రేటు రూ.61,150 గా నమోదైంది.

కిలో వెండి సైతం రూ.81వేల ధర పలుకుతున్నది. పొరుగు రాష్ట్రం తమిళనాడులోని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650గా ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.61,800కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 56,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ.61,150కి పెరిగింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ.56,200గా ఉంగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,310గా ఉన్నది. మరో వైపు ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.760 పెరిగి రూ.28,420కి చేరింది.

అక్షర తృతీయ నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరగవచ్చని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. కొద్ది రోజుల్లేనే బంగారం రేటు రూ.62వేల మార్క్‌ను దాటొచ్చని చెబుతున్నారు.

Exit mobile version