Site icon vidhaatha

Gold Rate | స్వల్పంగా తగ్గిన బంగారం.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..?

Gold Rate | దేశవ్యాప్తంగా పుత్తడి ధరలు వరుసగా రెండోరోజూ దిగి వచ్చాయి. సోమవారం స్వల్పంగా పది గ్రాముల 22 బంగారంపై రూ.10 తగ్గి.. రూ.56,490కి చేరింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10 తగ్గి రూ.61,630 వద్ద ట్రేడవుతున్నది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.56,640, ఇక తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,630 వద్ద కొనసాగుతున్నది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రూ.56,490 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,630 వద్ద ట్రేడవుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల పసడి ధర రూ. 56,910 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.62,080 వద్ద ట్రేడవుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.56,490 పలుకుతుండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.61,630 వద్ద కొనసాగుతున్నది.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీవ్యాప్తంగా బంగారం ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.77,770 వద్ద ట్రేడవుతున్నది. హైరదాబాద్‌లో కిలో వెండి ధర రూ.82,400 పలుకుతోంది.

Exit mobile version