Site icon vidhaatha

Gold Rate Hike | సామాన్యులకు షాక్‌ ఇచ్చిన బంగారం ధరలు.. మరోసారి రూ.60వేలు దాటిన పుత్తడి..!

Gold Rate Hike |

యూఎస్‌ జాబ్స్‌ డేటా వీక్‌గా ఉండడంతో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచబోదనే అంచనాలున్నాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసడి ధర పెరుగుతున్నది. ప్రస్తుతం ఔన్స్‌ బంగారం 1,974 డాలర్లు పలుకుతున్నది. ఈ ప్రభావం భారత మార్కెట్లపై సైతం పడుతున్నది.

దేశంలో బంగారం ధరలు భారీగానే పరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరుగుదల నమోదైంది. అదే సమయంలో వెండి కిలోకు రూ.500 పెరిగింది.

ఇక దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో దిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,820 చేరింది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,330 పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.55వేలు పలుకుతుండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60వేలు పలుకుతున్నది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60వేలకు పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం గోల్డ్‌ రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60వేలకు చేరింది.

మరో వైపు ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు కిలో వెండి ధర రూ.500 పెరగ్గా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.80,700 పలుకుతున్నది.

Exit mobile version