Gold Rate | దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆభరణాల తయారీకి వినియోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.55,550 వద్ద కొనసాగుతున్నది.
మరో వైపు 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.60,600 వద్ద కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.55,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,750గా ఉంది.
ముంబయిలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,650 వద్ద ట్రేడవుతున్నది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,940 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,040 పలుకుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి రూ.55,600 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,650 వద్ద ట్రేడవుతున్నది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,600 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధరలు సైతం స్థిరంగానే ఉన్నాయి. కిలో వెండి రూ.73వేలు పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో రూ.77వేలు ఉన్నది.