Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.350 వరకు తగ్గి రూ.55,050 దిగి వచ్చింది.
అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 వరకు తగ్గి రూ.60,400 ధర పలుకుతున్నది. కిలో వెండిపై రూ.100 తగ్గి కిలో రూ.74వేలు పలుకుతున్నది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,200 వద్ద కొనసాగుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050కి దిగివచ్చింది.
చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,550కి తగ్గింది. బెంగళూరులో 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,100కి చేరింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,050 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం తదితర జిల్లాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,500 వద్ద కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పడిపోయాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1936 డాలర్లకు తగ్గగా.. స్పాట్ సిల్వర్ రేటు 23.59 డాలర్ల వద్ద కొనసాగుతోంది.