WhatsApp | వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. కొత్త ఫీచర్‌ను తేనున్న వాట్సాప్‌..!

WhatsApp | ఇన్‌స్టంట్‌ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ యూజర్ల కోసం ఎప్పటికప్పుటు కొత్త ఫీచర్లను తీసుకువస్తూ ఉంటుంది. తాజాగా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. ప్రస్తుతం ‘స్టికర్‌ మేకర్‌ టూల్‌’ పేరుతో ఫీచర్‌ను తీసుకురానున్నది. యూజర్లు వేరే థర్డ్‌ పార్టీ యాప్స్‌ను వినియోగించుకోకుండానే వినియోగదారులు సొంతంగా తమకు నచ్చిన స్టిక్టర్స్‌ను తయారు చేసుకోవచ్చు. ‘స్టిక్కర్‌ మేకర్‌ టూల్‌’ ఫీచర్‌పై.. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetaInfo ప్రకటించింది. iOS బీటా వెర్షన్‌ 23.3.77లో ఈ టూల్‌ వెర్షన్‌ అందుబాటులో […]

  • Publish Date - May 23, 2023 / 07:00 AM IST

WhatsApp | ఇన్‌స్టంట్‌ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ యూజర్ల కోసం ఎప్పటికప్పుటు కొత్త ఫీచర్లను తీసుకువస్తూ ఉంటుంది. తాజాగా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. ప్రస్తుతం ‘స్టికర్‌ మేకర్‌ టూల్‌’ పేరుతో ఫీచర్‌ను తీసుకురానున్నది.

యూజర్లు వేరే థర్డ్‌ పార్టీ యాప్స్‌ను వినియోగించుకోకుండానే వినియోగదారులు సొంతంగా తమకు నచ్చిన స్టిక్టర్స్‌ను తయారు చేసుకోవచ్చు. ‘స్టిక్కర్‌ మేకర్‌ టూల్‌’ ఫీచర్‌పై.. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetaInfo ప్రకటించింది. iOS బీటా వెర్షన్‌ 23.3.77లో ఈ టూల్‌ వెర్షన్‌ అందుబాటులో ఉందని పేర్కొంది.

iOS 23.3.77లో కొంత మంది వినియోగదారులకు ప్రస్తుతం అందుబాటులో ఉందని పేర్కొంది. స్టిక్కర్‌ మేకర్‌ టూల్‌ ఫీచర్‌ ఫొటోను స్టిక్కర్‌గా మారుస్తుందని తెలిపింది. టెస్ట్‌ఫ్లైట్‌ యాప్‌లో అందుబాటులో ఉన్న iOS 23.10.0.74 వెర్షన్‌ అప్‌డేట్‌లో ఉంది.

అయితే, ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపరిచేందుకు వాట్సాప్‌ పనిచేస్తోందని ఫీచర్‌ ట్రాకర్‌ చెప్పింది. అయితే, ఈ ఫీచర్‌ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని.. అయితే, ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందనే దానిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఫీచర్‌ ఎలా పనిచేసే అవకాశం ఉంటుందో ఓ రిపోర్ట్‌ తెలిపింది.

స్టికర్‌ మేకర్‌ ఫీచర్‌ను.. మొబైల్‌ లైబ్రరీలో నుంచి ఎంచుకొని.. ఆ ఫొటోకు కొన్ని మార్పులు చేసేందుకు అవకాశం ఇస్తుందని తెలుస్తుంది. అయితే ఈ తరహా ఫీచర్‌ వాట్సాప్‌ వెబ్‌, వాట్సాప్‌ డెస్క్‌టాప్‌లో అందుబాటులో ఉందని నివేదిక తెలిపింది.

అయితే, ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉండగా.. స్టిక్కర్‌ మేకర్‌ టూల్‌ ఫీచర్‌ మాత్రం iOS వినియోగదారులకు మరిన్ని అదనపు టాల్స్‌తో అందుబాటులోకి రానుంది. ఈ స్టిక్కర్‌ టూల్‌ పూర్తిస్థాయిలో అప్‌డేట్‌ చేసిన తర్వాత.. మొదట iOS అప్‌డేట్‌లో విడుదల చేసే అవకాశం ఉందని వాట్సాప్‌ ట్రాకర్‌ వివరించింది.

Latest News