Google Bard | చాట్‌ జీపీటీకి పోటీగా.. గూగుల్ ‘బార్డ్’ అదిరిపోయే అప్‌డేట్‌

Google | Bard విధాత‌: ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ (Google)త‌న చాట్‌బాట్ బార్డ్‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఇక నుంచి యూజ‌ర్ లొకేష‌న్‌ను ఎనెబుల్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఈ ఏర్పాటు వ‌ల్ల యూజ‌ర్ త‌న ప్రాంతానికి, సంస్కృతి త‌గిన స‌మాధానాలు పొందే వీలుంటుంది. దీంతో ఇప్పుడు గూగుల్ బార్డ్‌ను ఓపెన్ చేయ‌గానే.. మీ డివైజ్ లొకేష‌న్‌ను యాక్సెస్ చేయ‌డానికి అనుమ‌తి ఇవ్వండి అని పాప్అప్ మెసేజ్ క‌న‌బ‌డుతుంది. దానికి అనుమ‌తిస్తే మ‌రింత […]

  • Publish Date - June 5, 2023 / 04:39 PM IST

Google | Bard

విధాత‌: ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ (Google)త‌న చాట్‌బాట్ బార్డ్‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఇక నుంచి యూజ‌ర్ లొకేష‌న్‌ను ఎనెబుల్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఈ ఏర్పాటు వ‌ల్ల యూజ‌ర్ త‌న ప్రాంతానికి, సంస్కృతి త‌గిన స‌మాధానాలు పొందే వీలుంటుంది.

దీంతో ఇప్పుడు గూగుల్ బార్డ్‌ను ఓపెన్ చేయ‌గానే.. మీ డివైజ్ లొకేష‌న్‌ను యాక్సెస్ చేయ‌డానికి అనుమ‌తి ఇవ్వండి అని పాప్అప్ మెసేజ్ క‌న‌బ‌డుతుంది. దానికి అనుమ‌తిస్తే మ‌రింత నిర్దుష్ట‌మైన స‌మాధానాలు ఇవ్వ‌డానికి బార్డ్ ప్ర‌య‌త్నిస్తుంది.

ఎందుకు ముఖ్య‌మంటే..

స్థానికి వ్యాపారాలు, కార్య‌క‌లాపాలు ఏఐ వ‌ల్ల లాభ‌ప‌డాలంటే స్థానిక‌త ఆధారంగా సెర్చింగ్‌కు అవ‌కాశం ఉండ‌టం అత్య‌వ‌స‌రం. మ‌న చుట్టుప‌క్క‌ల ఉన్న చిన్న చిన్న దుకాణాలు, మాల్స్ గురించి బోర్డ్ స‌మాచారం ఇస్తే ఆ వ్యాపారాలకు, వినియోగ‌దారుల‌కు కూడా ఉప‌యుక్త‌మే. ఉదాహ‌ర‌ణ‌కు ఉత్త‌మ రెస్టారెంట్ల‌ను సూచించ‌మ‌ని బార్డ్‌ను మీరు అడిగార‌నుకోండి.. లొకేష‌న్ ఆఫ్ చేస్తే అది దేశ విదేశాల్లో ఉన్న వాటిని మీకు చూపిస్తుంది.

అదే ఈ అప్‌డేట్ వ‌ల్ల తొలుత మీ చుట్టుప‌క్క‌ల ఉన్న వాటిని సూచిస్తుంది. ఇదంతా ఆ యూజ‌ర్ వాడుతున్న డివైజ్ లొకేష‌న్ ఆధారంగా జ‌రుగుతుంది. అయితే ఈ అప్‌డేట్‌ను గూగుల్ ప్ర‌స్తుతం బీటా ద‌శ‌లో ప‌రీక్షిస్తోంది. త్వ‌ర‌లోనే అంద‌రికీ అందుబాటులోకి రానుంది.

వేగం పెంచిన గూగుల్‌

చాట్‌జీపీటీ క్ర‌మంలో ఏఐలో మొద‌టి స్థానానికి ఎగబాకుతుండటంతో గూగుల్ అప్ర‌మ‌త్త‌మైంది, త‌న బార్డ్‌కు వ‌ర‌స‌గా అప్‌డేట్‌లు ఇస్తూ వ‌స్తోంది. గ‌త నెల‌లో టెక్ట్స్ ఆధారంగా ఇమేజెస్‌ను అందించే అప్‌డేట్ ఇవ్వ‌గా.. వేచి చూసే స‌మ‌యాన్ని తొల‌గించి ఒకే సారి 180 దేశాల్లో బార్డ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.