Site icon vidhaatha

Telangana Cabinet | గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కం కింద 4 ల‌క్ష‌ల ఇండ్లు.. రూ.3 ల‌క్ష‌ల ఆర్థిక సాయం

Telangana Cabinet | ఇప్ప‌టికే డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను( Double Bed Room Houses ) నిర్మించి పేదల‌కు అండ‌గా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం( Telangana Govt ) మ‌రో కొత్త ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. సొంత జాగా ఉండి ఇండ్లు క‌ట్టుకోలేని ప‌రిస్థితిలో ఉండే నిరుపేద‌ల కోసం గృహ‌ల‌క్ష్మి( GruhaLaxmi Scheme ) అనే ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్( CM KCR ) అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ప‌థ‌కం కింద తొలి విడుత‌లో 4 ల‌క్ష‌ల మందికి రూ. 3 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం అందించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది.

కేబినెట్ స‌మావేశం ముగిసిన అనంత‌రం ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు( Minister Harish Rao ) మీడియాకు వెల్ల‌డించారు. 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో 3 వేల చొప్పున 4 ల‌క్ష‌ల మందికి గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కం కింద ఆర్థిక సాయం అందిస్తామ‌న్నారు.

అంతే కాకుండా 43 వేల ఇండ్లు రాష్ట్ర కోటాలో పెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు. ఇక ల‌బ్దిదారుల ప్ర‌క్రియ‌ను పార‌ద‌ర్శ‌కంగా చేప‌ట్టి, వీలైనంత త్వ‌ర‌గా ఆర్థిక సాయం అందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు హ‌రీశ్‌రావు తెలిపారు.

ఇక రూ. 3 ల‌క్ష‌ల ఆర్థిక సాయం మూడు ద‌ఫాలుగా ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఒక్కో విడ‌త‌లో రూ. ల‌క్ష చొప్పున మూడు విడ‌త‌ల్లో ల‌బ్దిదారుల ఖాతాల్లో జ‌మ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే ఈ ప‌థ‌కం అమ‌లు కోసం బ‌డ్జెట్‌లో రూ. 12 వేల కోట్ల నిధులు కేటాయించుకున్నామ‌ని తెలిపారు. అయితే మ‌హిళ‌ల ఖాతాల్లోనే న‌గ‌దు జ‌మ చేస్తామ‌ని పేర్కొన్నారు.

Exit mobile version