Nalgonda: ధాన్యం కొనుగోలు వివాదం.. వ్యాపారి ఆత్మహత్య

విధాత: ధాన్యం కొనుగోలు విషయంలో వివాదం వ్యాపారి ఆత్మహత్యకు దారి తీసింది. ఈ ఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం జయరాం తండాలో సోమవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దవూర మండలం జయరాం తండాకు చెందిన రమావత్ శ్రీనుకు భార్య ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. వారు గ్రామంలో ధాన్యం వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి గత నెల అదే గ్రామానికి చెందిన రమావత్ లాలు తన పొలం‌లో పండించిన […]

  • Publish Date - December 5, 2022 / 02:19 PM IST

విధాత: ధాన్యం కొనుగోలు విషయంలో వివాదం వ్యాపారి ఆత్మహత్యకు దారి తీసింది. ఈ ఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం జయరాం తండాలో సోమవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పెద్దవూర మండలం జయరాం తండాకు చెందిన రమావత్ శ్రీనుకు భార్య ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. వారు గ్రామంలో ధాన్యం వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి గత నెల అదే గ్రామానికి చెందిన రమావత్ లాలు తన పొలం‌లో పండించిన సుమారు 100 క్వింటాల ధాన్యాన్ని రమావత్ శ్రీను‌కి గత నెల 18న అమ్మాడు.

ఈ విష‌య‌మై రమావత్ లాలుకి శ్రీను ధాన్యం డబ్బులు ఇవ్వడంలో జాప్యం చేయడంతో పెద్ద మనుషుల సమక్షంలో ఇటీవల పంచాయితీ పెట్టి మాట్లాడుకున్నారు. ఆ పంచాయితీలో రమావత్ లాలు ధాన్యానికి చెందిన రసీదును శ్రీను అందరి ముందు చింపివేసి, నువ్వు నాకు ధాన్యం అమ్మలేదని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దాంతో మనస్థాపానికి గురైన రమావత్ శ్రీను ఆదివారం రాత్రి 11, 12 గంటల సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ‌మ‌నించిన కుటుంబ సభ్యులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే శ్రీను మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

శ్రీను మృతికి కారణమైన రమావత్ లాలు ఇంటి ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను సద్దుమణిగేలా చేశారు. బాధిత‌ కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతుడి బంధువులు శాంతించారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.