CMR రైస్ పై సమీక్ష.. ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి FCI కి త‌ర‌లించాలి: కలెక్టర్ రాజర్షి షా

అటవీ.. రెవెన్యూ భూముల వివాదాన్ని పరిష్కరించాలి.. అధికారులకు సూచించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: లబ్దిదారులకు ఇచ్చిన అసైన్డ్ భూమి అటవీ శాఖ పరిధిలోకి రాకుండా, ధరణి రికార్డులో నమోదయి డిజిటల్ సైన్ పెండింగ్‌ గల వాటిని డిజిటల్ సైన్ చేయ‌డానికి తగు చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూముల […]

  • Publish Date - March 23, 2023 / 11:23 AM IST

  • అటవీ.. రెవెన్యూ భూముల వివాదాన్ని పరిష్కరించాలి..
  • అధికారులకు సూచించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: లబ్దిదారులకు ఇచ్చిన అసైన్డ్ భూమి అటవీ శాఖ పరిధిలోకి రాకుండా, ధరణి రికార్డులో నమోదయి డిజిటల్ సైన్ పెండింగ్‌ గల వాటిని డిజిటల్ సైన్ చేయ‌డానికి తగు చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూముల పరిష్కారంపై మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ రమేష్తో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నశంకరంపేట్ మండలంలోని సూరారం, ఎస్.కొండాపూర్, టి.మాందాపూర్, గజగట్లపల్లిలోని వివిధ సర్వే నెంబర్లలో అందజేసిన అసైన్డ్ పట్టా భూములు, రెవెన్యూ రికార్డులతో సరిచూసి డిజిటల్ సైన్ కోసం చర్యలు తీసుకోవలసిందిగా సూచించారు. అనంతరం 2021-22 ఖరీఫ్‌కు సంబంధించి CMR రైస్ పై సమీక్షి చేస్తూ పెండింగ్‌లో ఉన్న13,700 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి FCI కి తరలించాల్సిందిగా మిల్లర్లకు సూచించారు. ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడవు పొడగించినందున ఈ వారం రోజులలో పెండింగ్‌లో ఉన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి భారత ఆహార సంస్థకు పంపించాల్సిందిగా సూచించారు.

ఇటీవల హైద్రాబాద్‌లో అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో జరిగిన సమావేశంలో సి.ఏం.ఆర్. పెండింగ్ ఉన్న మిల్లర్లకు ఎట్టి పరిస్థితులలో 2022-23 రబీకి సంబంధించి ధాన్యం కేటాయించరాదని నిర్ణయం తీసుకున్నారని, కాబట్టి మిల్లర్లు ఎవ్వరు కూడా డిఫాల్ట్ కాకుండా పెండింగ్ సి.ఏం.ఆర్. అందించేందుకు కృషిచేయాలని అన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ తిరస్కరించిన బియ్యాన్ని ఆయా మిల్లర్లు 48 గంటలలో తీసుకెళ్లాలని, రాష్ట్ర, కేంద్ర గిడ్డంగులు, వ్యవసాయ మార్కెట్ కమిటీలలో హమాలీల సంఖ్య పెంచాలని, నూతన గోనె సంచులు అందించ‌డానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సమావేశంలో జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్, ఆర్.డి.ఓ. సాయి రామ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శశి కుమార్, డి.ఎస్.ఓ. శ్రీనివాస్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు చంద్ర పాల్, తహసీల్ధార్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Latest News