విధాత,హైదరాబాద్: రాష్ట్రంలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈ నెల 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది.
ఈ నెల 9 లేదా 10 నుంచి అభ్యర్థులకు హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నది. వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్ లో ప్రత్యేక లింకు ఇవ్వనున్నది. ఈ ఉద్యోగాలకు 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.