విధాత: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ముందుగానే ప్రకటించిన విధంగా టీఎస్‌పీఎస్‌సీ అధికార వెబ్సైట్‌లో పొందుపరిచి, ప్రత్యేక లింక్ ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. అక్టోబర్ 16 (ఆదివారం)న ప్రిలిమినరీ పరీక్ష జరగనున్నది. ఫిబ్రవరిలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హాల్‌టికెట్ల కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి. https://www.tspsc.gov.in/