విధాత, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కీ రేపు (శనివారం) వెలువడనున్నట్టు సమాచారం. ఓఎంఆర్ జవాబు పత్రాల ఇమేజ్ స్కానింగ్ దాదాపు పూర్తి అయ్యింది.
ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ఓఎంఆర్ ఇమేజ్ డౌన్ లోడ్ సదుపాయంతో కలిపి ప్రాథమిక కీ వెలువరిం చాలని కమిషన్ భావిస్తున్నది.
ప్రాథమిక కీ విడుదల చేసిన తర్వాత అయిదు రోజుల పాటు అభ్యంతరాలకు గడువు ఇవ్వనున్నది. అభ్యంతరాలు నమోదు కాకుంటే రెండు, మూడు రోజుల్లో తుది కీ ప్రకటించనున్నది.