Site icon vidhaatha

Gujarat Accident | జనాలపైకి దూసుకెళ్లిన కారు.. 9మంది మృతి.. గుజరాత్‌లో ఘటన..!

Gujarat Accident |

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది గాయపడ్డారు.

ఈ ఘటన గురువారం తెల్లవారు జామున 1.15 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్‌ – ఎస్‌జీ హైవేపై ఉన్న ఇస్కాన్‌ వంతెనపై జరిగింది. వివరాల్లోకి వెళితే.. వంతనపై థార్‌, ట్రక్కు ఢీకొట్టుకున్నాయి. దీంతో అక్కడ పలువురు జనం పోగై.. సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే అటువైపుగా 120 కిలోమీటర్ల వేగంతో వచ్చిన జాగ్వార్‌ కారు.. జనంపైకి దూసుకెళ్లింది. వేగంగా ఢీకొట్టడంతో తొమ్మిది మంది సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో పోలీస్‌కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డు సైతం ఉన్నారు. మరో 13 మంది వరకు గాయపడగా.. వారిని ఆసుపత్రిలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version