Site icon vidhaatha

నాటి గుజ‌రాత్ అల్ల‌ర్ల పోస్ట‌ర్ బాయ్‌.. మళ్లీ వైరల్‌

విధాత‌: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుజరాత్ అల్లర్ల నాటి పోస్టర్ బాయ్ అశోక్ మోచికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మతతత్వ పార్టీలు వాడుకుని వదిలేస్తాయి. అధికారం కోసం ఎంతమందినైనా బలి చేస్తాయని ఆ ఫొటో కింద రాసుకొస్తున్నారు.

రెండు దశాబ్దాలకు పైగా అక్కడ అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఈసారి కూడా ఈజీగా గెలుస్తుందని ఆ పార్టీ నేతలతో పాటు కొంతమంది విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారు. మరికొంత మంది మాత్రం అది అంత ఈజీ కాదని, గుజరాత్ మోడల్ అని దేశంలో అధికారంలోకి వచ్చిన మోడీ హయాంలో ఈ ఎనిమిది ఏళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని అంటున్నారు.

ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగం పెరిగిపోయిందని, ఆదివాసుల హక్కులు హరించ బడుతున్నాయని ఆరోపిస్తున్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ప్రమాదంలో పడ్డాయని వాదించే వారున్నారు. ఈసారి ఇవన్నీ అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించ బోతున్నాయా అంటే అవుననే అంటున్నారు వాళ్లు.

Exit mobile version