విధాత: మేడ్చల్ జిల్లా మూడుచింతపల్లి మండలం ఉద్దెమర్రిలో కాల్పుల కలకలం చెలరేగింది. ముగ్గురు దుండగులు తుపాకీతో బెదిరించి రూ. రెండు లక్షలు అపహరించారు. దుండగులు రాత్రి మద్యం దుకాణం వద్దకు మాస్కులు ధరించి వచ్చి క్యాషియర్, మరో సిబ్బందిపై కర్రలతో దాడి చేశారు.
మేడ్చల్: తుపాకీతో కాల్పులు జరిపి.. రూ. 2లక్షలు అపహరణ pic.twitter.com/mLU5Zr9mtY
— vidhaathanews (@vidhaathanews) January 24, 2023
మద్యం దుకాణం సిబ్బంది తరగబడటంతో దుండగులు కాల్పులు జరిపారు. సిబ్బంది తప్పించుకోవడంతో తుపాకీ తూటా దుఖాణ షటర్‌కు తాకింది. దుండగులు పారిపోతుండగా దుకాణ సిబ్బంది కేకలు వేయడంతో పారిపోతూ 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దుకాణ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.