విధాత: ఘటన.. చావు ఎవర్నీ ఎప్పుడు పలుకరిస్తుందో తెలియదు. ఏ సమయంలో చనిపోతామో కూడా తెలియదు. ఏ రూపంలో ప్రాణాలు కోల్పోతామో కూడా తెలియదు. ఓ జిమ్ ట్రైనర్ తన చైర్‌లో కూర్చొని కుప్పకూలిపోయాడు. దీంతో జిమ్‌లో ఉన్న యువకులు అప్రమత్తమయ్యారు. తక్షణమే జిమ్ ట్రైనర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా, గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది. అయితే జిమ్ ట్రైనర్ కుర్చీలోనే కుప్పకూలిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘజియాబాద్‌లోని శాలిమార్ గార్డెన్ ఏరియాలో అదిల్ అనే వ్యక్తి సొంతంగా జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.