Site icon vidhaatha

తీవ్ర విషాదం.. హాలోవీన్ వేడుక‌ల్లో తొక్కిస‌లాట‌.. 151 మంది మృతి

విధాత‌: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. సియోల్‌లో నిర్వహించిన హాలోవీన్ వేడుక‌లు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తొక్కిస‌లాట కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు 151 మంది మృతి చెందారు. మ‌రో 150 మందికి పైగా గాయ‌ప‌డ్డారు.

వీరిలో చాలా మంది గుండెపోటుకు గురి కాగా.. మ‌రికొంద‌రు ఊపిరి తీసుకునేందుకు చాలా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. క‌రోనా ఆంక్ష‌ల్ని స‌డ‌లించ‌డంతో దాదాపు ల‌క్ష మంది వ‌ర‌కు హాలోవీన్ వేడుక‌ల్లో పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది.

అయితే.. ప్ర‌తి సంవ‌త్స‌రంలాగానే ఈ సారి హాలోవీన్ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశారు. శ‌నివారం రాత్రి ఇటావాన్‌లో ఓ ఇరుకైన వీధి గుండా వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు వెలుతుండ‌గా ఒక్క‌సారిగా తొక్కిస‌లాట చోటు చేసుకుంది.

Exit mobile version