Site icon vidhaatha

Pension | వినూత్న ప‌థ‌కం.. పెళ్లి కాని ఒంట‌రి పురుషుల‌కు పెన్ష‌న్

Pension | వితంతువులు, వృద్ధులు, విక‌లాంగుల‌కు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెన్ష‌న్లు అందిస్తున్న విష‌యం విదిత‌మే. ఆయా ప్ర‌భుత్వాల ఆర్థిక ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా.. నెల‌కు ఏంతో కొంత ఆర్థిక సాయం అందిస్తున్నాయి.

తెలంగాణ ప్ర‌భుత్వం ఒంట‌రి మ‌హిళ‌ల‌కు పెన్ష‌న్ అందిస్తున్న‌ట్టుగానే.. హ‌ర్యానా ప్ర‌భుత్వం పెళ్లి కాని పురుషుల‌కు పెన్ష‌న్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ వినూత్న ప‌థ‌కాన్ని నెల రోజుల్లో శ్రీకారం చుట్టాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

నిన్న క‌ర్నాల్‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ పాల్గొన్నారు. అక్క‌డ ఓ 60 ఏండ్ల వృద్ధుడు (పెళ్లి కాలేదు) మాట్లాడుతూ.. పెన్ష‌న్ ద‌ర‌ఖాస్తు విష‌యంలో తాను స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌ట్లు సీఎంకు విన్న‌వించాడు.

దీనికి ఖ‌ట్ట‌ర్ బ‌దులిస్తూ.. 45 నుంచి 60 ఏండ్ల మ‌ధ్య వారికి పెన్ష‌న్ ఇచ్చేలా కొత్త ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలిపారు. 45 ఏండ్లు పైబ‌డి వివాహం కాని పురుషులు, మ‌హిళ‌లు ఉంటే అలాంటి వారికి నెల‌వారీ పెన్ష‌న్లు ఇచ్చేలా కొత్త ప‌థ‌కాన్ని నెల రోజుల్లోగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని సీఎం చెప్పారు.

Exit mobile version