తారకరత్న ‘పెద్దకర్మ’ ఇన్విటేషన్ కార్డ్ చూశారా..

విధాత‌: నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న మహాశివరాత్రి నాడు మృతి చెందిన సంగతి తెలిసిందే. తారకరత్న పెద్దకర్మ డేటును ఫిక్స్ చేశారు పెద్దలు. ఆ పెద్దలు ఎవరో కాదు విజయసాయిరెడ్డి, బాలకృష్ణలే. తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటి నుంచి.. అంత్యక్రియలు ముగిసే వరకు బాలకృష్ణ అన్ని దగ్గరుండి చూసుకున్నారు. నందమూరి కుటుంబానికి పెద్ద దిక్కయ్యారు. ఇక విజయసాయిరెడ్డి.. తారకరత్న భార్య బంధువు కావడంతో తాను కూడా కుటుంబ పెద్దలా ముందుకు వచ్చి తారకరత్న అంత్యక్రియలలో భాగమయ్యారు. ఆయన రాజకీయాలు […]

  • Publish Date - February 27, 2023 / 02:50 PM IST

విధాత‌: నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న మహాశివరాత్రి నాడు మృతి చెందిన సంగతి తెలిసిందే. తారకరత్న పెద్దకర్మ డేటును ఫిక్స్ చేశారు పెద్దలు. ఆ పెద్దలు ఎవరో కాదు విజయసాయిరెడ్డి, బాలకృష్ణలే. తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటి నుంచి.. అంత్యక్రియలు ముగిసే వరకు బాలకృష్ణ అన్ని దగ్గరుండి చూసుకున్నారు. నందమూరి కుటుంబానికి పెద్ద దిక్కయ్యారు.

ఇక విజయసాయిరెడ్డి.. తారకరత్న భార్య బంధువు కావడంతో తాను కూడా కుటుంబ పెద్దలా ముందుకు వచ్చి తారకరత్న అంత్యక్రియలలో భాగమయ్యారు. ఆయన రాజకీయాలు పక్కనపెట్టి నందమూరి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా బాలకృష్ణ, చంద్రబాబు నాయుడుతో మాట్లాడడం నుంచి.. తారకరత్న విషయంలో ఆయన చూపించిన ప్రతి విషయం అభినందనీయం అని చెప్పవచ్చు. బాలకృష్ణ, విజయసాయిరెడ్డి.. ఇద్దరూ తారక కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇప్పుడు పెద్దకర్మను కూడా దగ్గరుండి చేయాలని భావించారు.

ఈ పెద్దకర్మకు సంబంధించి తేదీ నిర్ణయించారు. కుటుంబ సభ్యులు కార్డును ప్రింట్ చేయించారు. కార్డులో బాలకృష్ణ, విజయసాయిరెడ్డిలే.. పెద్దకర్మకు రావాలని బంధుమిత్రులను ఆహ్వానించారు. మార్చి 2వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో తారకరత్న పెద్దకర్మ నిర్వహిస్తున్నామని కార్డులో తెలిపారు.

తారకరత్న: పుట్టిన రోజు నాడే చిన్న కర్మ.. ఇదే మా చివరి ట్రిప్.. అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరితరం?

బాలకృష్ణ, విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు. తారకరత్న సతీమణి అలేఖ్య వారి పిల్లలు నిషిక, తనయ్ రాయ్, రేయా పేర్లు ప్ర‌చురించారు. ఇందులో తార‌క‌ర‌త్న 18న మహాశివ‌రాత్రినాడు శివైక్యం చెందారు. కావున ప్రతి ఒక్కరు విచ్చేసి తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మనవి చేసుకున్నారు.

Latest News