Rains | హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రేపు ఉద‌యం వ‌ర‌కు దంచికొట్టే అవ‌కాశం..!

Rains | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌ళ్లీ భారీ వ‌ర్షం కురుస్తోంది. న‌గ‌రం వ్యాప్తంగా వాన దంచికొడుతోంది. ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురియ‌డంతో.. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింది. మంగ‌ళ‌వారం ఉద‌యం వ‌ర‌కు వాన కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. సికింద్రాబాద్, బోయిన్‌ప‌ల్లి, మారేడ్‌ప‌ల్లి, బేగంపేట్, ప్యాట్నీ, ప్యార‌డైజ్, చిల‌క‌ల‌గూడ‌, తార్నాక‌, రాంన‌గ‌ర్, ఉప్ప‌ల్, ముషీరాబాద్, చిక్క‌డ‌ప‌ల్లి, కోఠి, మ‌ల‌క్‌పేట‌, అంబ‌ర్‌పేట‌, ల‌క్డీకాపూల్, ఖైర‌తాబాద్, సోమాజిగూడ‌, నారాయ‌ణ‌గూడ‌, హిమాయ‌త్‌న‌గ‌ర్‌, […]

  • Publish Date - July 31, 2023 / 12:08 PM IST

Rains | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌ళ్లీ భారీ వ‌ర్షం కురుస్తోంది. న‌గ‌రం వ్యాప్తంగా వాన దంచికొడుతోంది. ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురియ‌డంతో.. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింది. మంగ‌ళ‌వారం ఉద‌యం వ‌ర‌కు వాన కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

సికింద్రాబాద్, బోయిన్‌ప‌ల్లి, మారేడ్‌ప‌ల్లి, బేగంపేట్, ప్యాట్నీ, ప్యార‌డైజ్, చిల‌క‌ల‌గూడ‌, తార్నాక‌, రాంన‌గ‌ర్, ఉప్ప‌ల్, ముషీరాబాద్, చిక్క‌డ‌ప‌ల్లి, కోఠి, మ‌ల‌క్‌పేట‌, అంబ‌ర్‌పేట‌, ల‌క్డీకాపూల్, ఖైర‌తాబాద్, సోమాజిగూడ‌, నారాయ‌ణ‌గూడ‌, హిమాయ‌త్‌న‌గ‌ర్‌, మెహిదీప‌ట్నం, గ‌చ్చిబౌలి, మాదాపూర్‌, రాయ‌దుర్గం, కొండాపూర్, బోర‌బండ‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో సోమ‌వారం సాయంత్రం భారీ వ‌ర్షం కురిసింది.

ఈ నేప‌థ్యంలో న‌గ‌ర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనే బ‌య‌ట‌కు రావాల‌ని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మంగ‌ళ‌వారం కూడా మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉందని తెలిపారు. స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం 040 21111111, 9000113667 నంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల‌ని సూచించింది.

Latest News