విధాత, హైదరాబాద్: బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ పీడీ యాక్టు కేసుపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ఆరగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నెల 20వ తేదీ లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి గడువును పెంచబోమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ నిర్వహించింది. పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు సమావేశం ఇటీవలనే ముగిసిందని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ బోర్డు నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు.
ఈ నిర్ణయం వచ్చే వరకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. కనీనం రెండు వారాల సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. ఈ నెల 20వ తేదీ లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
గత నెల 29వ తేదీన పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు భేటీ జరిగింది. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజాసింగ్ హాజరయ్యారు. తనపై పీడీ యాక్ట్ ను నమోదు చేయడంపై రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే రకమైన అభ్యంతరాలతో రాజాసింగ్ భార్య ఉషాబాయ్ పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డుకు వినతిపత్రం సమర్పించింది. పీడీ యాక్ట్ విధించడాన్ని హైకోర్టులో రాజాసింగ్ సవాల్ చేశారు.