Himachal Pradesh | ఆరు­గురు కాంగ్రెస్‌ ఎమ్మె­ల్యే­లపై అన­ర్హత వేటు

ఆర్థిక బిల్లుపై ఓటింగ్‌ విష­యంలో పార్టీ విప్‌ను ధిక్క­రిం­చిన ఆరు­గురు కాంగ్రెస్‌ ఎమ్మె­ల్యే­లను హిమా­చల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీ­ప్‌­సింగ్‌ పఠా­నియా అన­ర్హు­లుగా ప్రక­టిం­చారు

  • Publish Date - February 29, 2024 / 09:46 AM IST

  • పార్టీ ఫిరా­యిం­పుల చట్టం కింద హిమా­చల్‌ స్పీకర్‌ నిర్ణయం

సిమ్లా: ఆర్థిక బిల్లుపై ఓటింగ్‌ విష­యంలో పార్టీ విప్‌ను ధిక్క­రిం­చిన ఆరు­గురు కాంగ్రెస్‌ ఎమ్మె­ల్యే­లను హిమా­చల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీ­ప్‌­సింగ్‌ పఠా­నియా అన­ర్హు­లుగా ప్రక­టిం­చారు. పార్టీ ఫిరా­యిం­పుల చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసు­కుం­టు­న్నట్టు వెల్ల­డిం­చారు. పార్టీ ఎమ్మె­ల్యే­లను ముఖ్య­మంత్రి సుఖ్విం­ద­ర్‌­సింగ్‌ సుఖు అల్పా­హార విందుకు ఆహ్వా­నిం­చిన నేప­థ్యంలో ఈ నిర్ణయం వెలు­వ­డింది. రాజిం­దర్‌ రాణా, సుధీర్‌ శర్మ, రవి ఠాకూర్‌, ఇందర్‌ దత్‌ లఖ­న్‌­పాల్‌, చైత­న్య­శర్మ, దేవీం­దర్‌ కుమా­ర్‌­లపై చర్యలు తీసు­కో­వా­లని ముఖ్య­మంత్రి ఫిర్యాదు నేప­థ్యంలో స్పీకర్‌ ఈ మేరకు నిర్ణయం తీసు­కు­న్నారు.


మంగ­ళ­వారం నాటి రాజ్య­సభ ఎన్ని­కల్లో బీజేపీ అభ్య­ర్థికి పలు­వురు కాంగ్రెస్‌ ఎమ్మె­ల్యేలు ఓటే­య­డంతో హిమా­చల్‌ ప్రదే­శ్‌లో రాజ­కీయ సంక్షోభం నెల­కొ­న్నది. ఇదిలా ఉంటే.. పలు నాటకీయ పరిణామాల్లో మంత్రిపదవికి చేసిన రాజీనామాను విక్రమాదిత్యసింగ్‌ బుధవారం సాయంత్రం ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ అధిష్ఠానం పంపిన దూతలు భూపేశ్‌ భగేల్‌, భూపిందర్‌సింగ్‌ హుడా, డీకే శివకుమార్‌తో చర్చల అనంతరం ఆయన తన మానసు మార్చుకున్నారు.

Latest News