Gautam Adani | ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నికర ఆదాయం తగ్గుతూ వస్తున్నది. అమెరికన్ సంస్థ హిడెన్‌బర్గ్ నివేదిక బహిర్గతం తర్వాత ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ప్రపంచకుబేరుల జాబితాలో మూడోస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ.. ప్రస్తుతం టాప్-20 జాబితాలో సైతం స్థానాన్ని దక్కించుకోలేకపోయారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ టాప్-20 రిచ్ లిస్ట్ నుంచి దిగువకు పడిపోయారు. ఆయన ప్రస్తుతం 22వ స్థానంలో ఉన్నట్లు ఇండెక్స్ పేర్కొంది. అదానీ ఒకే రోజులో దాదాపు పది బిలియన్ల సంపదను కోల్పోయారు. మరో వైపు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంపద 12.5 డాలర్లు పెరిగి ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానానికి చేరుకున్నారు.
కరిగిపోయిన 58 బిలియన్ డాలర్ల నికర విలువ
సెప్టెంబర్‌లో అదానీ నికర విలువ 155.7 బిలియన్ డాలర్లుగా ఉండేది. సోమవారం నాటికి ఈ విలువ 92.7కి పడిపోయింది. దదాపు 58 బిలియన్ డాలర్ల సంపద కొద్ది రోజుల్లోనే కరిగిపోయింది. డిసెంబర్ వరకు ప్రపంచంలో అదానీ మాత్రమే ప్రపంచకుబేరుడిగా నిలిచారు. ఆ ఏడాదంతా ఆయన సంపద పెరుగుతూ రాగా.. కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన 22వ స్థానానికి పడిపోయారు. అదానీ గ్రూప్ సంస్థ షేర్లలో అవకతవకలకు పాల్పడుతుందని, అకౌంట్స్‌లోనూ మోసాలకు పాల్పడుతుందని అమెరికా కేంద్రంగా పని చేస్తున్న హిడెన్‌బర్గ్ అనే ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. పెరుగుతూ వస్తున్న షేర్ల ధరల కారణంగా అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ సంపద మూడేళ్లలో బిలియన్ డాలర్లు పెరిగి 120 డాలర్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది. అదానీ గ్రూప్‌కు చెందిన ఏడు కంపెనీల షేర్లు సగటున 819శాతం పెరిగాయి.