మిడ్‌రేంజ్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసిన హానర్‌.. ధర, ఫీచర్స్‌ ఫుల్‌ డిటేయిల్స్‌ ఇవే..!

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హువావే హానర్‌ కంపెనీ సరికొత్తగా మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది

  • Publish Date - December 18, 2023 / 05:22 AM IST

Honor X8B Moblie | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హువావే హానర్‌ కంపెనీ సరికొత్తగా మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. ఈ మోడల్‌ పేరు హానర్‌ ఎక్స్‌8బీ. ఈ మోడల్‌ను కంపెనీ సౌదీ అరేబియాలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మోడల్‌ ఫీచర్స్‌ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


ఫీచర్స్‌ ఇవే..


హానర్‌ ఎక్స్‌8బీ మొబైల్‌లో 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్​తో కూడిన​ 6.7 ఇంచ్​ ఫుల్​హెచ్​డీ ప్లస్‌ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. దీని సైజ్‌ 161.05 x 74.5 x 6.78ఎంఎం ఉండగా.. ఈ మొబైల్​ బరువు 166 గ్రాములుంటుంది. హానర్​ ఎక్స్​8బీ ఫ్రెంట్​లో పిల్​ షేప్​ కటౌట్​ కనిపిస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 50ఎంపీ ఫ్రెంట్​ కెమెరాతో పాటు సాఫ్ట్​ ఎల్​ఈడీ ఫ్లాష్​ కూడా ఉంటుంది. ఇక రియల్‌​లో 108ఎంపీ ప్రైమరీ, 5 ఎంపీ అల్ట్రా-వైడ్​, 2 ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ కెమెరా సెటప్​తో వస్తుంది.


స్నాప్​డ్రాగన్​ 680 చిప్​సెట్​ ఉండగా.. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత మాజిక్​ ఓఎస్​ 7.2 యూఐ సాఫ్ట్​వేర్​పై నడుస్తుంది. మేజిక్​ క్యాప్సూల్​ నోటిఫికేషన్​ ఫీచర్​ సైతం మొబైల్‌లో ఉన్నది. 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ, 35వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తుంది. అంతే కాకుండా డ్యూయెల్​ సిమ్​, 4జీ వోల్ట్​ఈ, వైఫై 802.11ఏసీ, బ్లూటూత్​ 5.0జీ, జీపీఎస్​, యూఎస్​బీ టైప్​ సీ పోర్ట్​, సైడ్​ ఫేసింగ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​లు కనెక్టివిటీ ఫీచర్స్​ ఉన్నాయి.


హానర్​ ఎక్స్​8బీ ధర ఎంత ఉందంటే..?


హానర్​ ఎక్స్​8బీలో మూడు వేరియంట్లు ఉన్నాయి. 8జీబీ ర్యామ్​.. 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్.. 256జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్.. 512జీబీ స్టోరేజ్​ వేరియంట్లు ఉన్నాయి. మొబైల్‌ ప్రారంభ ధర 240 డాలర్లు ఉన్నది. భారతీయ కరెన్సీలో సుమారు రూ.20వేలు. ఇక స్మార్ట్‌ఫోన్‌ మూడుకలర్లలో వస్తుంది. మిడ్‌నైట్‌ బ్లాక్‌, టిటానియం సిల్వర్‌, గ్లామరస్‌ గ్రీన్‌ కలర్స్‌ అందుబాటులో ఉంది. అయితే, ఈ మోడల్‌లో మోడల్‌లో ఎప్పుడు లాంచ్‌ అవుతుందన్నది తెలియరాలేదు. దీనిపై కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Latest News