Site icon vidhaatha

Manipur | మ‌ణిపూర్ ఘ‌ట‌న‌లో న‌లుగురు అరెస్ట్.. ప్ర‌ధాన‌ నిందితుడి ఇంటికి నిప్పు

Manipur | మ‌ణిపూర్‌లో కుకీ వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను కొంద‌రు పురుషులు న‌గ్నంగా ఊరేగించి, వారిపై అత్యాచారం జ‌రిపిన ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది మే 4వ తేదీన చోటు చేసుకున్న ఈ ఆకృత్యానికి సంబంధించిన 26 సెక‌న్ల వీడియో బుధ‌వారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం విదిత‌మే. ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌లు, ప్ర‌ముఖులు తీవ్రంగా ఖండించారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసులో మొత్తం న‌లుగురిని అరెస్టు చేసిన‌ట్లు మ‌ణిపూర్ పోలీసులు వెల్ల‌డించారు. ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన ప్ర‌ధాన నిందితుడు హుయిరేమ్ హెరాదాస్ సింగ్‌(32)తో పాటు మ‌రో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

థౌబ‌ల్ జిల్లాలో బుధ‌వారం రాత్రంతా గాలింపు చేప‌ట్టి, హెరాదాస్‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. కిడ్నాప్, లైంగిక‌దాడి, మ‌ర్డ‌ర్ కేసుల‌ను నిందితుల‌పై న‌మోదు చేశారు. గురువారం ఉద‌యం ఇద్ద‌రిని అరెస్టు చేయ‌గా, రాత్రి వ‌ర‌కు మ‌రో ఇద్ద‌రిని అరెస్టు చేశారు.

ప్ర‌ధాన నిందితుడి ఇంటికి నిప్పు..

ఈ ఘ‌ట‌న‌కు కార‌కుడైన ప్ర‌ధాన నిందితుడు హెరాదాస్ ఇంటిని గ్రామ‌స్తులు త‌గుల‌బెట్టారు. దాస్ కుటుంబ స‌భ్యుల‌ను గ్రామం నుంచి బ‌హిష్క‌రించారు. ఘ‌ట‌న జ‌రిగిన రోజు హెరాదాస్ గ్రీన్ క‌ల‌ర్ టీ ష‌ర్ట్ ధ‌రించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. న‌గ్నంగా మార్చిన ఓ మ‌హిళ‌ను హెరాదాస్ ఈడ్చుకెళ్తున్న‌ట్లు వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని పోలీసులు తెలిపారు.

Exit mobile version