Husnabad | మామా అల్లుళ్లు.. హుస్నాబాద్‌ను మూడు ముక్కలు చేశారు: రేవంత్‌ రెడ్డి

HUSNABAD, REVANTH REDDY విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని,ఇందిరమ్మ రాజ్యం తేవాలని అందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి (REVANTH REDDY) పిలుపునిచ్చారు. గురువారం హత్ సే హాత్ జొడో యాత్రలో భాగంగా రేవంత్ చేపట్టిన పాదయాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2004లో కరీంనగర్ జిల్లా […]

  • Publish Date - March 2, 2023 / 05:16 PM IST

HUSNABAD, REVANTH REDDY

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని,ఇందిరమ్మ రాజ్యం తేవాలని అందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి (REVANTH REDDY) పిలుపునిచ్చారు. గురువారం హత్ సే హాత్ జొడో యాత్రలో భాగంగా రేవంత్ చేపట్టిన పాదయాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

2004లో కరీంనగర్ జిల్లా కేంద్రంగా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించి మాట నిలబెట్టుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. 2024 జనవరి 1వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో తోటపల్లి, గౌరవెల్లి, గండి పల్లి, ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సభా ముఖంగా హామీ ఇచ్చారు.

ఏడాదిలోగా ప్రభుత్వంలో కాళీగా ఉన్న 2లక్షల ద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలండర్ ఇస్తామన్నారు. రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఓటు బలంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావు మంత్రులుగా, బిడ్డ ఎమ్మెల్సీగా, సడ్డకుని కొడుకు సంతోష్ రావు ఎంపీగా పదవులు అనుభవిస్తూ జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు.

మామా అల్లుళ్ల.. కుట్రతో… హుస్నాబాద్ నియోజకవర్గం మూడు ముక్కలు

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మంత్రి హరీశ్‌రావు కుట్రలతో హుస్నాబాద్ (HUSNABAD) నియోజకవర్గం మూడు ముక్కలుగా విడిపోయిందని సిద్దిపేట కరీంనగర్ వరంగల్ జిల్లాలో ఒక్కో మండలంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కలుపుతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ప్రధానమంత్రి మోడీ తెలంగాణకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని దుయ్యబట్టారు. అడ్డదారులతో అధికారంలోకి రావాలని పిరాయింపులు ప్రోత్సహించేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని ఆరోపించారు బిజెపి..బి అర్ యస్ కుట్రలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరారు.

మిడ్ మానేరు భూములు కోల్పోయిన కేసీఆర్ సడ్డకుడు కొడుకు సంతోష్ రావు ఆయన చెల్లెలు కూడా ఆర్ అండ్ ప్యాకేజీ ఇచ్చారని కేసీఆర్ సడ్డకుడు కొడుకు కూతురుకు ఉపన్యాయం గండిపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల ఒక న్యాయమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎంతకాలo ఈ దౌర్భాగ్యాన్ని బరిద్దామని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కు డిపాజిట్ దక్కదని అన్నారు. ఎమ్మెల్యేల అపాయింట్మెం ట్ సీఎం కేసీఆర్ ఇవ్వడని కానీ ఎమ్మెల్యే సతీష్ ఇంటికే సీఎం కేసీఆర్ వస్తాడని ప్రాజెక్టుల సంగతి అడగకుండా,అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధికి ఆమడ దూరంలో హుస్నాబాద్ ఉందని అన్నారు.

ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు మాట్లాడారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్,అంజన్ కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి,ప్రవీణ్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Latest News