Site icon vidhaatha

Sucide | ఫేస్‌బుక్ లైవ్‌లో హైద‌రాబాద్ టెకీ ఆత్మ‌హ‌త్య‌.. భ‌ర్త‌పై ఆరోప‌ణ‌లు

Sucide |

భ‌ర్త త‌న‌ను వేధిస్తున్నాడ‌ని పేర్కొంటూ ఫేస్‌బుక్ లైవ్‌లో ఉరేసుకుని 29 ఏళ్ల హైద‌రాబాద్ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ప్ర‌స్తుతం నాచారంలో త‌న‌ పుట్టింట్లో ఉంటున్న ఆమె.. బుధ‌వారం ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది. మృతురాలి పేరు స‌నా ప‌టేల్‌గా తెలుస్తోంది. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమ్ చేసిన ఈ యువ‌తి ఆత్మహ‌త్య చేసుకునే ముందు భ‌ర్త హేమంత్ ప‌టేల్‌ వేధింపుల‌ను ఏక‌ర‌వు పెట్టింది.

ప్ర‌స్తుతం డీజేగా ఉన్న హేమంత్.. మ‌రో యువ‌తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడ‌ని వీడియోలో ఆరోపించింది. స‌నా భ‌ర్త, అత్త‌మామ‌ల‌పై కేసు న‌మోదు చేశామ‌ని పోలీసులు శుక్ర‌వారం తెలిపారు. కాగా అప్ప‌ట్లో ఎయిర్‌హోస్టెస్‌గా ప‌నిచేసే స‌నాకు ఐదేళ్ల క్రితం రాజ‌స్థాన్‌కు చెందిన హేమంత్ ప‌రిచ‌యమ‌య్యాడు. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి వివాహం చేసుకున్నారు.

ఇటీవ‌ల మ‌రో యువ‌తి ప‌రిచ‌యం కావ‌డంతో స‌నాని శారీర‌కంగా హింసించేవాడ‌ని తెలుస్తోంది. చిన్న చిన్న విష‌యాల‌కే గొడ‌వ పెట్టుకునే వాడ‌ని ఫేస్‌బుక్ లైవ్‌లో సనా వాపోయింది. ఆరు నెల‌ల క్రితం ఉద్యోగం కోసం సిప్ర‌స్ వెళ్లిన హేమంత్‌.. రెండు నెల‌లుగా ఫోన్‌లోనూ త‌ప్పించుకోవ‌డం, త‌న‌కు ఫోన్ చేయొద్ద‌ని హెచ్చ‌రించ‌డంతో స‌నా తీవ్ర డిప్రెష‌న్ బారిన ప‌డింది.

Exit mobile version