Site icon vidhaatha

ఉదయ్ కిరణ్ సూసైడ్‌కు కారణం తెలుసు.. బాంబు పేల్చిన తేజ!

విధాత: క్రియేటివ్ దర్శకుడిగా పేరున్న తేజ.. తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఇంతకీ ఆయన ఏం కామెంట్స్ చేశాడని అనుకుంటున్నారా? ఆయన చేయడానికి ఏముంటాయి? ఆ ఉదయ్ కిరణ్ సూసైడ్‌కి సంబంధించిన కామెంట్సేగా!. ఈ మధ్య కాలంలో సినిమాలు ప్రకటించడమే కానీ.. వాటిని సెట్స్‌పైకి తీసుకుపోని తేజ.. ఎట్టకేలకు ‘అహింస’ అనే ఓ ప్రాజెక్ట్‌ని చేస్తూ.. దానిని పూర్తి చేసేందుకు, ఆ సినిమాని వార్తలలో ఉంచేందుకు చాలా కష్టాలు పడుతున్నాడు.

ఆ సినిమా ఇప్పుడు విడుదలకు దగ్గర పడుతుండటంతో సినిమాపై ఎలాగైనా క్రేజ్ తీసుకురావాలని చేశాడో.. లేదంటే మరికొన్ని యూట్యూబ్ ఛానళ్లు తన చుట్టూ తిరగాలని చేశాడో.. తెలియదు కానీ.. ఉదయ్ కిరణ్ సూసైడ్‌కు కారణం తనకు తెలుసని ఓ బాంబ్ పేల్చాడు.

దగ్గుబాటి వారసుడు, రానా దగ్గుబాటి తమ్ముడైన అభిరామ్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. తేజ చేసిన చిత్రం ‘అహింస’. ఈ సినిమా విడుదలకు దగ్గరైనా కూడా ఎటువంటి బజ్ లేదు. అసలెవరు మాట్లాడుకున్న వారు కూడా లేరు. పైగా విడుదలైన టీజర్ కూడా ‘జయం’ సినిమానే పోలి ఉండటంతో తేజాలో సరుకు అయిపోయిందనేలా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడిచింది.

తేజ మనుగడ ఇంకొంత కాలం సాగాలంటే.. ఖచ్చితంగా ఆ సినిమా హిట్టవ్వాలి. హిట్టు సంగతి సరే.. ముందు జనాలకి ఇదొక సినిమా ఉందనే విషయం తెలియాలి కదా. అందుకోసమే తేజ మరోసారి ‘ఉదయ్ కిరణ్’ ఉదంతాన్ని తీసుకొస్తూ.. వార్తలలో నిలవాలని చూస్తున్నట్లుగా.. తాజాగా ఆయన కామెంట్స్ చూసిన వాళ్లంతా అనుకుంటుండటం విశేషం.

ఎందుకంటే, ఇప్పటికే అనేక మార్లు.. ఉదయ్ కిరణ్ మృతికి సంబంధించి తేజ ఇంటర్వ్యూలలో చెప్పి ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా.. ‘ఉదయ్ కిరణ్ చనిపోయే కొన్ని రోజుల ముందు నాకు ఫోన్ చేసి.. చాలా విషయాలు చెప్పాడు. అవన్నీ ఇప్పుడు నేను బయటకు చెప్పడానికి ధైర్యం సరిపోదు.

కానీ, నేను చనిపోయే లోపు మాత్రం ఖచ్చితంగా ఆ విషయాలు బయటపెడతాను’ అంటూ.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ చెప్పుకొచ్చాడు. మరి ఇన్నాళ్లూ లేనిది.. ఇప్పుడే తేజ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య తర్వాత.. కోర్టు కేసులు నడిచిన సమయంలో కూడా మాట్లాడని తేజ.. ఇప్పడెందుకిలా షాకింగ్‌గా మాట్లాడుతున్నాడు.. అనేది ఆయనకే తెలియాలి. చూసే వారికి మాత్రం.. ఇది సినిమా ప్రమోషన్ కోసమనే అనిపిస్తుంది. అంతేగా!

Exit mobile version