విధాత: కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు కన్నాతానే ఎక్కువ చదువుకున్నోన్నని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అన్న మాటలతో అక్కడ ఉన్నవారంతా నోరెళ్ల బెట్టారు.
పేద దళిత కుటుంబంలో పుట్టిన తాను అంబేద్కర్ ఆశయాల వెలుగులో ఉన్నత చదువులు చదివానన్నారు. ఎంఏ, ఎంఫిల్, బీఈడీ చేసి టీచర్ ఉద్యోగం సాధించానన్నారు. కడు పేదరికంలో కష్టాలను అనుభవించిన తాను పేదల కష్టాలు పోవాలంటే ప్రజాసేవకు అంకితం కావాలని నిర్ణయించుకొని రాజకీయాల్లో చేరానని తెలిపారు.
రాష్ట్రసాధనోద్యమంలో చురుకుగా ఉండి తన వంతు బాధ్యతను నెరవేర్చానని అన్నారు. రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కష్టపడి చదివి డాక్టరేట్ సాధించానని చెప్పుకొచ్చారు.